హర్యానాలోని ఝజ్జర్ జిల్లా బద్లీ గ్రామానికి చెందిన మణ్‌పాల్ ధిల్లా పేరు మోసిన గ్యాంగ్‌స్టర్. హత్య కేసుల్లో జీవిత శిక్ష అనుభవిస్తోన్న ధిల్లా.. 2018లో పెరోల్ మీద బయటకొచ్చి.. తప్పుడు డాక్యుమెంట్లతో దేశం విడిచి పారిపోయాడు. కంబోడియాలో తలదాచుకున్న ధిల్లా.. అక్కడే ఓ అమ్మాయితో ప్రేమలో పడ్డాడు. ఆమెతో సహజీవనం చేసి నలుగురు పిల్లలను కన్నాడు. గత ఏడాది అతణ్ని భారత అధికారులు కంబోడియా నుంచి ఇండియాకు తీసుకొచ్చి జైల్లో వేశారు. ఇప్పుడు పెరోల్ మీద విడుదలైన అతడు తన ప్రేయసి పెళ్లాడి మళ్లీ జైలుకెళ్లాడు.


