జమ్మూ కశ్మీర్‌లో ఉగ్రవాద ఏరివేత చర్యలు ముమ్మరంగా సాగుతున్నాయి. తాజాగా, కీలక ఉగ్రవాదిని భద్రతా బలగాలు ముట్టబెట్టాయి. లోయలో వైమానిక దళం, ఆర్మీ సిబ్బందిపై దాడుల్లో ముఖ్య సూత్రధారి అయిన యాసిర్ కోసం గత కొన్నాళ్ల నుంచి సైన్యం జల్లెడ పడుతోంది. అతడి కదలికలను గుర్తించి.. చివరకు యూస్‌మార్గ్‌లో ఉన్నట్టు తేల్చారు. పహల్గామ్ ఉగ్రదాడి ముష్కరులతో అతడు దిగిన ఫోటోలు అప్పట్లో వైరల్ అయ్యాయి. తొలిసారిగా 2024లో అతడి ఉనికి వెలుగులోకి వచ్చింది.
జమ్మూ కశ్మీర్‌లో ఎన్‌కౌంటర్.. మోస్ట్ వాంటెడ్ లష్కరే కీలక ఉగ్రవాది హతం
RELATED ARTICLES


