ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చొరవతో పల్లె చెరువులు కొత్త కళ సంతరించుకుంటున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు రూ. 50 కోట్లతో 105 చెరువుల ఆధునీకరణ పనులు చేపడుతున్నారు. ఇందులో ఇప్పటికే 26 చెరువులకు సంబంధించిన పనులు పూర్తయ్యాయి. ఆధునిక హంగులతో ఆహ్లాదకర కేంద్రాలుగా చెరువులను తీర్చిదిద్దుతున్నారు. అభివృద్ధి పనులతో వాకింగ్ ట్రాక్‌లు, ఓపెన్ ఎయిర్ జిమ్‌లు, చిల్డ్రన్ పార్కులతో చెరువులు కొత్త రూపు సంతరించుకుంటున్నాయి. సెప్టెంబర్ నెలాఖరుకల్లా పనులు పూర్తి చేసేందుకు అధికారులు చర్యలు చేపడుతున్నారు.
చెరువులు కావిక టూరిస్ట్ స్పాట్లు!.. వాకింగ్ ట్రాకులు, చిల్డ్రన్ పార్కులు ఏర్పాటు.. పవన్ ప్రత్యేక చొరవ..
RELATED ARTICLES


