కొండా సురేఖను కేబినెట్ నుంచి బర్తరఫ్ చేసిన నేపథ్యంలో మంత్రివర్గంలో మరో మహిళా నేతకు అవకాశం కల్పించే అంశం ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఈ క్రమంలోనే ఆ స్థానంలో ఎమ్మెల్సీ విజయశాంతి పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. ఇక మంత్రి పదవిపై హైకమాండ్‌తో విజయశాంతి చర్చలు జరిపేందుకు రెడీ అయ్యారని.. ఢిల్లీకి పయనం అయ్యేందుకు సిద్ధమయ్యారనే వార్తలు వినిపిస్తున్నాయి. అంతేకాకుండా ఆమె హోంశాఖను కోరుతున్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.


