ఈ సమస్య ఏ వయసు వారికైనా రావచ్చు. మలద్వార కండరాలు, నరాలు, పేగుల పనితీరు లేదా పెల్విక్ ఫ్లోర్ (కటి కండరాల) లోపాలు దీనికి కారణం కావచ్చు. ఇది బయటకు చెప్పుకోవడానికి ఇబ్బందిగా అనిపించినప్పటికీ, ఇది ఒక సాధారణ వైద్య సమస్య మాత్రమే. సరైన కారణాన్ని గుర్తిస్తే దీనికి మంచి చికిత్స అందుబాటులో ఉంది. దీనికి గల ప్రధాన కారణాలు, నిర్లక్ష్యం చేసే ప్రారంభ సంకేతాలు, చికిత్సా విధానాలు గురించి పూర్తి సమాచారాన్ని డాక్టర్ అనుపమ ఎన్. కె. (సీనియర్ కన్సల్టెంట్ – మెడికల్ గ్యాస్ట్రోఎంటరాలజీ, ఆస్టర్ సిఎంఐ హాస్పిటల్, బెంగళూరు) అందించారు. ఆ పూర్తి వివరాలేంటో ఇప్పుడు చుద్దాం.
చెప్పుకోలేక – ఆపుకోలేక ఇబ్బంది పడుతున్నారా? మలం లీక్ అవ్వడానికి కారణాలు, పాటించాల్సిన చిట్కాలు!
హైరాక్స్ బీజింగ్ ఈవెంట్ సందర్భంగా ఆస్ట్రేలియా అథ్లెట్ జోవన్నా వీట్రిక్ మలవిసర్జన నియంత్రణ కోల్పోయిన వార్త ఇప్పుడు వైరల్ అయింది. ఈ పరిస్థితిని ఫీకల్ ఇన్‌కాంటినెన్స్ (Fecal Incontinence) అంటారు. సులభంగా చెప్పాలంటే మల విసర్జనపై నియంత్రణ కోల్పోవడం వల్ల అనుకోకుండా మలం లేదా జిగట పదార్థాం లీక్ కావాడాన్ని ‘ఫీకల్ ఇన్‌కాంటినెన్స్’ అంటారు. ఇది లోదుస్తులపై చిన్న మరక పడటం నుంచి, అసలు విసర్జనను ఏమాత్రం ఆపుకోలేకపోవడం వరకు ఏ రూపంలోనైనా ఉండొచ్చు. ఇది అప్పుడప్పుడు లేదా నిరంతరం జరగొచ్చు. గ్యాస్ వదిలేటప్పుడు, బరువులు ఎత్తేటప్పుడు లేదా ఎలాంటి ముందస్తు సూచన లేకుండా అకస్మాత్తుగా కూడా లీక్ కావచ్చు.


