ఏపీ ప్రభుత్వ తీరుపై రిటైర్డ్ ఐపీఎస్ ఏబీ వెంకటేశ్వరరావు సెటైర్లు వేశారు. పోలవరం ఎడమ కాలువ ద్వారా నీటి విడుదల నేపథ్యంలో ప్రభుత్వం పత్రికలలో యాడ్స్ ఇచ్చింది. అయితే ఈ ప్రకటనలలో జలవనరుల శాఖ మంత్రిగా ఉన్న నిమ్మల రామానాయుడు ఫోటో లేకపోవటంపై ఏబీ వెంకటేశ్వరరావు.. సీఎం చంద్రబాబుపై సెటైర్లు వేశారు. త్రీమెన్ కేబినెట్‌తో పరిపాలిస్తే సరిపోతుందిగా అంటూ విమర్శించారు.


