ఢిల్లీ పర్యటనలో భాగంగా కేంద్రమంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌తో సమావేశమైన సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణకు సంబంధించిన పలు కీలక అంశాలపై చర్చించారు. డిసెంబర్లో జరగనున్న ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్-2026కు రాజ్‌నాథ్‌ను ఆహ్వానించారు. ఈ సదస్సులో నిర్వహించే రక్షణ ఎక్స్పోను ప్రారంభించాలని కోరారు. దేవరకద్రలో డీఆర్డీఎల్ ప్రాజెక్టుకు ఉచితంగా భూమిని కేటాయించేలా సహకరించాలని విజ్ఞప్తి చేశారు. అదే సమయంలో ఆదిలాబాద్ ఎయిర్‌పోర్టుకు ఇప్పటికే 750 ఎకరాలు సేకరించామని.. మరో 750 ఎకరాలు సేకరించేందుకు సిద్ధంగా ఉన్నామని సీఎం తెలిపారు.


