ప్రస్తుత కాలంలో మారుతున్న జీవనశైలి, ఆహారపు అలవాట్టు వల్ల కొలెస్ట్రాల్ సమస్య చాలా మందిని వేధిస్తోంది. రక్తంలో చెడు కొలెస్ట్రాల్ పెరగడం వల్ల గుండె సంబంధిత జబ్బులు వచ్చే ప్రమాదం ఎంతో పెరుగుతుంది. అయితే కేవలం మందులపైనే ఆధారపడకుండా మన రోజు వారీ ఆహారంలో మార్పులు చేయడం ద్వారా దీనిని అదుపు చేయవచ్చు. ముఖ్యంగా మన ఇంట్లో పీచు పదార్థాలు, పోషకాలు సమృద్ధిగా ఉండే పిండి రకాలు కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో సరైన పాత్ర పోషిస్తాయి. ముఖ్యంగా శుద్ధి చేసిన మైదా వంటి పిండులకు దూరంగా ఉంటూ పోషక విలువలున్న ధాన్యాల పిండులను ఆహారంలో భాగం చేసుకోవాలి. ఓట్స్, శనగ, గోధుమ, జొన్న, సజ్జ పిండ్లు శరీరంలోని చెడు కొవ్వును కరిగించి గుండెను ఆరోగ్యంగా ఉంచుతాయి. ఈ పిండులు కొలెస్ట్రాల్‌ను ఎలా నియంత్రిస్తాయో వాటిని రోజువారీ వంటకాల్లో ఎలా ఉపయోగించాలో వివరంగా తెలుసుకుందాం..


