శ్రీలంకతో కొలంబో వేదికగా ప్రారంభమైన రెండో టెస్టు తొలి రోజే మైదానంలో తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. హాఫ్ సెంచరీకి చేరువలో ఉన్న భారత ఓపెనర్ యశస్వి జైస్వాల్ (45)ను బౌల్డ్ చేసిన లంక పేసర్ అసింత ఫెర్నాండో, అతడి వద్దకు వెళ్లి దూకుడుగా మాట్లాడాడు. దీంతో ఆగ్రహించిన జైస్వాల్ వెనక్కి తిరిగి బౌలర్ వైపు దూసుకెళ్లాడు. ఇద్దరి మధ్య గొడవ ముదరడంతో లంక కెప్టెన్ డిసిల్వా జోక్యం చేసుకుని సర్దిచెప్పాడు.


