హెడింగ్లే వేదికగా జరిగిన తొలి టెస్టులో ఇంగ్లాండ్ చేతిలో ఘోర పరాజయం పాలైన పాకిస్థాన్, వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ (డబ్ల్యూటీసీ) పాయింట్ల పట్టికలో అట్టడుగున 9వ స్థానానికి పడిపోయింది. ఆడిన 7 మ్యాచుల్లో 5 ఓటములు చవిచూసి కేవలం 19.05% విజయ శాతంతో నిలిచింది. ఈ ఘోర పతనంతో పాకిస్థాన్ డబ్ల్యూటీసీ ఫైనల్ చేరే అవకాశాలు దాదాపు ఆవిరయ్యాయి. ప్రస్తుతం ఆస్ట్రేలియా 77.78% విజయ శాతంతో టేబుల్‌లో అగ్రస్థానంలో కొనసాగుతోంది.


