శ్రీలంకతో జరుగుతున్న రెండో టెస్టులో భారత యువ బ్యాటర్ దేవదత్ పడిక్కల్ అద్భుత సెంచరీతో చెలరేగాడు. తొలి టెస్ట్ వేదిక గాలేలో శతకం బాదిన పడిక్కల్, ఇప్పుడు కొలంబోలోనూ సెంచరీ సాధించి లంక పర్యటనలో వరుసగా రెండో వంద నమోదు చేశాడు. ఈ మైలురాయితో టెస్టుల్లో భారత్ తరఫున మూడో స్థానంలో తన స్థానాన్ని మరింత పటిష్టం చేసుకున్నాడు. ఈ ఇన్నింగ్స్లో పడిక్కల్.. 193 బంతుల్లో 117 పరుగులు చేసి ఔట్ అయ్యాడు.


