సూపర్ డూపర్ ఎల్ నినో దెబ్బకు ప్రపంచం మొత్తం అతలాకుతలమవుతోంది. ఈ ఏడాది రుతుపవనాల సీజన్లో కురువాల్సిన వర్షపాతం కంటే తక్కువ స్థాయిలో నమోదయ్యింది. దీంతో పంటలు ఎండిపోయి.. తాగునీటికి కూడా ఇబ్బందికర పరిస్థితి ఎదురవుతోంది. ఈ నేపథ్యంలో ఎల్ నినో పరిస్థితులపై సమీక్షకు తెలంగాణ ప్రభుత్వం మంత్రివర్గ ఉప సంఘం ఏర్పాటుచేసింది. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లును అధ్యక్షుడిగా నియమించింది. ఈ కమిటీలో మరో ఐదుగురు మంత్రులు సభ్యులుగా ఉన్నారు.


