Weekly Horoscope: జ్యోతిష్యశాస్త్రం ప్రకారం, దసరా పండుగ సందర్భంగా ఈ వారం ఎంతో ప్రాముఖ్యతను సంతరించుకుంది. ఈ వారం ప్రారంభంలో గ్రహాల స్థానాల్లో మరియు గమనంలో అనేక మార్పులు జరగనున్నాయి. అక్టోబర్ 17న సూర్యుడు తులారాశిలోకి ప్రవేశించాడు. ఈ వారమంతా ఇదే రాశిలో ఉంటాడు. దీనికంటే ముందే బుధుడు, తిరోమనంలో శుక్రుడు ఇదే రాశిలో నివాసం ఉన్నారు. అయితే అక్టోబర్ 24న బుధుడు వక్రమార్గంలోకి ప్రయాణం చేయనున్నాడు. మరోవైపు కుజుడు, గురుడు కర్కాటక రాశిలో నివాసం ఉంటారు. గురువు ఉచ్ఛ స్థితిలో(అత్యంత బలమైన స్థితిలో) ఉంటాడు. మరోవైపు చంద్రుడు మకరంలో నివాసం ఉంటాడు. ఆ తర్వాత కుంభం, మీనం, మేషరాశిలోకి ప్రవేశించనున్నాడు. శని మీన రాశిలో వక్రమార్గంలో, రాహువు, కేతువులు వరుసగా కుంభం, సింహ రాశిలో, అక్టోబర్ 24న శుక్రుడు చిత్రా నక్షత్రంలో, అదే రోజున సూర్యుడు స్వాతి నక్షత్రంలోకి ప్రవేశించనున్నాడు. అంతేకాదు శుభ యోగాలతో పాటు దుర్గాదేవి ప్రత్యేక ఆశీస్సులు కూడా లభించే అవకాశం ఉంది. ఈ సందర్భంగా విజయదశమి వేళ ఏర్పడే శుభ యోగాలు, గ్రహాల సంచారం వల్ల ద్వాదశ రాశుల వారిలో ఎవరికి ప్రయోజనాలు కలగనున్నాయనే వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
Weekly Horoscope: దసరా వారంలో ఏ రాశుల వారికి ఆర్థిక లాభాలు? ఎవరికి సవాళ్లు ఎదురుకానున్నాయి?
RELATED ARTICLES


