సీఈసీ జ్ఞానేశ్ కుమార్ రాజీనామాను డిమాండ్ చేస్తూ ప్రతిపక్ష ఇండియా కూటమి చేపట్టిన ఆందోళనలు మరింత ఉద్ధృతం అవుతోంది. రాహుల్ గాంధీ నాయకత్వంలో కొనసాగుతోన్న ఈ నిరసన ప్రణాళిక గురించి ఆయనను మీడియా ప్రశ్నించింది. ఈ సందర్భంగా ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇది రుద్రతాండవమని, దీనికి ఎలాంటి ప్లాన్ అవసరం లేదని ఆయన స్పష్టం చేశారు. ఇందులో ఎవరైనా వచ్చి చేరొచ్చని సీజేపీకి పరోక్షంగా ప్రతిపక్ష నేత ఆహ్వానం పలికారు.


