మరికొద్ది నెలల్లో ఉత్తర్ ప్రదేశ్ అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్నాయి. దేశంలోనే అతిపెద్ద రాష్ట్రమైన యూపీలో వరుసగా రెండుసార్లు గెలిచి ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసిన బీజేపీ.. మూడోసారి గెలవాలనే పట్టుదలతో ఉంది. అయితే, ప్రధాన ప్రతిపక్షం ఎస్పీ నుంచి ఈసారి గట్టిపోటీ ఎదురవుతుందనే అంచనాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో అయోధ్య నుంచి దమ్ముంటే పోటీచేసి గెలవాలని సీఎం యోగి ఆదిత్యనాథ్‌కు అఖిలేష్ యాదవ్ సవాల్ విసిరారు. దీనిపై యోగి కూడా స్పందించడంతో ఒక్కసారిగా రాజకీయం వేడెక్కింది.


