సీఈసీ జ్ఞానేష్ కుమార్కు వ్యతిరేకంగా సీజేపీ తలపెట్టిన నిరసన కార్యక్రమాన్ని అడ్డుకోడానికి ఢిల్లీ పోలీసులు చేసిన ప్రయత్నాలపై ప్రముఖ సామాజిక కార్యకర్త సోనమ్ వాంగ్చుక్ తీవ్రంగా స్పందించారు. దేశంలో అప్రకటిత అత్యవసర పరిస్థితి కొనసాగుతోందని ఆయన విమర్శించారు. ఈ క్రమంలో అరెస్ట్ చేసిన సీజేపీ నాయకులను తక్షణమే విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు. రేపటిలోగా వారిని రిలీజ్ చేయకుంటే తాను మరోసారి ఆమరణ దీక్షకైనా దిగుతా లేదంటే పాదయాత్ర చేస్తా అని వార్నింగ్ ఇచ్చారు.


