Ysrcp Make Changes In Regional Coordinators: వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు పార్టీ ప్రాంతీయ సమన్వయకర్తలను నియమిస్తూ పార్టీ కేంద్ర కార్యాలయం ప్రకటన విడుదల చేసింది. ఎంపీ వైవీ సుబ్బారెడ్డిని ఉమ్మడి గుంటూరు జిల్లాకు ప్రాంతీయ సమన్వయకర్తగా నియమించింది. అలాగే ఆళ్ల అయోధ్య రామిరెడ్డికి ఉమ్మడి కృష్ణా, ఉమ్మడి ప్రకాశం జిల్లాల ప్రాంతీయ సమన్వయకర్తగా బాధ్యతలు అప్పగించింది. పార్టీ బలోపేతం, సమన్వయం, కార్యకర్తలకు అందుబాటులో ఉండేలా ప్రాంతాల వారీగా బాధ్యతలను అప్పగించింది.


