Coal India Subsidiary IPO: దిగ్గజ ప్రభుత్వ రంగ సంస్థ కోల్ ఇండియా నుంచి ఇటీవలి కాలంలో వరుసగా ఐపీఓలు వస్తున్న సంగతి తెలిసిందే. ఈ ఏడాదిలోనే ఇప్పటికే రెండు ఐపీఓలు రాగా మరో రెండు ఐపీఓలు సిద్ధంగా ఉన్నాయి. కోల్ ఇండియా తన అనుబంధ సంస్థ సౌత్ ఈస్టర్న్ కోల్ఫీల్డ్స్ లిమిటెడ్ (SECL) ను మార్కెట్లో లిస్టింగ్ చేసేందుకు చూస్తోంది. ఈ ఐపీఓ ద్వారా 800 మిలియన్ డాలర్ల వరకు నిధుల్ని సమీకరించాలని ప్లాన్ చేస్తోంది.


