పీఎంశ్రీ పథకం కింద పాఠశాలల్లో కొత్త కోర్సులను బోధిస్తున్నారు. ప్రయోగాత్మకంగా ప్రతి జిల్లాలో కొన్ని పాఠశాలలను ఎంపిక చేసి ఈ విధానాన్ని అమలు చేస్తున్నారు. భవిష్యత్లో ఉద్యోగ అవకాశాలు పొందాలి అనుకునే వారికి ఇది మంచి ఛాన్స్. ఐటీ పాఠాలే కాకుండా ఆటోమొబైల్ విభాగం, ఎలక్ట్రానిక్స్, హెల్త్ అండ్ వెల్నెస్పై కూడా అవగాహన కల్పిస్తూ పాఠాలు బోధిస్తున్నారు. భవిష్యత్తులో విద్యార్థులకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభించేలా శిక్షణ ఇవ్వడమే ప్రభుత్వ లక్ష్యమని చెబుతున్నారు.
PM SHRI: పాఠశాలల్లోనే ఐటీ పాఠాలు.. విద్యార్థులకు ఇదే మంచి ఛాన్స్!
RELATED ARTICLES


