మన పురాణాలు, ఇతిహాసాలు అపారమైన జ్ఞాన భాండాగారాలు. జీవితంలో ఎదురయ్యే సందిగ్ధతలు, ఆపదల్ని తొలగించుకోవడం నుంచి విజయవంతమైన జీవితాన్ని గడపడం వరకు ప్రతి విషయానికీ ఉదాహరణలతో కూడిన పరిష్కారాలు వీటిలో లభిస్తాయి. మహాభారతంలో ధృతరాష్ట్రుడు, విదురుడి మధ్య జరిగిన సంభాషణ (విదుర నీతి) కూడా అటువంటి జ్ఞాన సారాంశమే. విదురనీతిలో మొత్తం 8 అధ్యాయాలు ఉన్నాయి. విదురుడు ధృతరాష్ట్రుడు, పాండురాజులకు సోదరుడు. ఆయన జ్ఞానం, సత్య మార్గం, నిబద్ధతకు మారుపేరు. ఆయన బోధించిన కొన్ని ముఖ్యమైన జీవన సూత్రాలు ఇప్పటికీ ఆచరణీయంగా ఉన్నాయి. అలాంటి ఏడు సూత్రాలు (Motivational Quotes) గురించి ఇప్పుడు తెలుసుకుందాం.


