TCS Digital Skills: భారత ఐటీ దిగ్గజం టీసీఎస్ కొత్త నియామకాల్లో సుమారు 80 శాతం మందికి డిజిటల్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నైపుణ్యాలు ఉండాలని లక్ష్యంగా పెట్టుకుంది. సెప్టెంబర్ త్రైమాసికంలో ఏఐ ఆధారిత పనుల వాటా- మొత్తం ఆదాయంలో 10 శాతానికి చేరుకుంది. ఏఐ ఒప్పందాలు మరింత పెరిగితే లాభాల మార్జిన్లు మెరుగుపడతాయని కంపెనీ కూడా అంచనా వేస్తోంది.


