Ganesh Chaturthi 2026: తెలుగు పంచాంగం ప్రకారం, ప్రతి ఏడాది భాద్రపద మాసం శుక్ల పక్షంలో చవితి తిథి నాడు వినాయక చతుర్థి పండుగ జరుపుకుంటారు. ఈ నేపథ్యంలో ఈ ఏడాది సెప్టెంబర్ 14వ తేదీన సోమవారం నాడు గణేష్ చతుర్థి పండుగను జరుపుకోనున్నారు. ఈ పవిత్రమైన రోజున దేశవ్యాప్తంగా గణేష్ ఉత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభమవుతాయి. వినాయక ఉత్సవాలు దాదాపు 10 రోజుల పాటు జరుపుకుంటారు. దేవుళ్లందరిలో మొట్టమొదటి పూజలందుకునే దేవుడిగా ప్రత్యేకత ఉన్న వినాయకుడికి ఈరోజున ప్రత్యేక పూజలు చేయడం వల్ల కోరిన కోరికలన్నీ నెరవేరుస్తాడని చాలా మంది నమ్ముతారు. అంతేకాదు ఏదైనా కొత్త పని ప్రారంభించాలన్నా, శుభకార్యం మొదలు పెట్టాలన్నీ ముందుగా వినాయకుడినే పూజిస్తారు. ఈ పర్వదినాన గజాననుడిని ప్రసన్నం చేసుకునేందుకు అనేక ఆచార వ్యవహారాలను ఆచరిస్తారు. ఇదిలా ఉండగా, జ్యోతిష్యశాస్త్రం ప్రకారం, వినాయక చవితి రోజున లంబోదరుడిని ప్రసన్నం చేసుకోవడానికి మీ రాశి ప్రకారం కొన్ని వస్తువులను, నైవేద్యాన్ని సమర్పించడం వల్ల గణపతి ప్రత్యేక ఆశీస్సులు లభిస్తాయని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు. ఈ సందర్భంగా వినాయక చవితి సందర్భంగా ఏ రాశి వారు ఏం సమర్పించాలనే ఆసక్తికరమైన విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.
Ganesh Chaturthi 2026: మీ రాశి ప్రకారం బొజ్జ గణపయ్యకు ఏ నైవేద్యం సమర్పించాలో తెలుసా?
RELATED ARTICLES


