వైద్యుల నిర్లక్ష్యానికి ఏపీ ప్రభుత్వం చెక్ పెట్టింది. విధులకు హాజరు కాని 70 మంది ప్రభుత్వ వైద్యులపై వేటు వేసింది. అనధికారంగా విధులకు గైర్హాజరవుతున్న 70 మందిని డిస్మిస్ చేసింది. ఇదే పద్ధతిలో వ్యవహరిస్తున్న మరో 193 మందిపై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. దీనికి సంబంధించిన చర్యలు వివిధ దశల్లో ఉన్నట్టు తెలుస్తుంది. కాగా మే నెలలో ప్రభుత్వ బోధనాస్పత్రుల్లో పనిచేస్తున్న 51 మంది డాక్టర్లను శాశ్వతంగా తొలగించింది. అందులో 8 మంది అసోసియేట్ ప్రొఫెసర్లు, 41 మంది అసిస్టెంట్ ప్రొఫెసర్లు కూడా ఉన్నారు.
శ్రీవారి భక్తుడి ఉదారత: ఎస్వీ ప్రాణదాన ట్రస్ట్‌కు రూ.1.02 కోట్ల భారీ విరాళం
శ్రీవారి భక్తుడైన నోముల అశోక్ కుమార్ తన ఉదారతను చాటుకున్నారు. టీటీడీ నిర్వహించే ఎస్వీ ప్రాణదాన ట్రస్ట్ కోసం ఏకంగా రూ.1.02 కోట్ల రూపాయల విరాళాన్ని అందించారు. శుక్రవారం స్వయంగా టీటీడీ చైర్మన్ బీఆర్ నాయకుడును కలసి ఆర్థిక సాయం అందించారు. ఈ సందర్భంగా చైర్మన్ బీఆర్ నాయుడు, అశోక్ కుమార్‌ను శాలువాతో సత్కరించి, శ్రీవారి ప్రసాదాలను అందజేశారు. కాగా ఈ ట్రస్ట్ నిధులతో నిరుపేదలకు ఉచితంగా అధునాతన వైద్య చికిత్సలు, శస్త్రచికిత్సలు అందిస్తుంది. స్వీ ప్రాణదాన ట్రస్ట్ 2001 నవంబర్‌లో ప్రారంభమైంది. అప్పటి నుంచి ఎంతోమంది పేదలకు ఉచితంగా వైద్య సేవలు అందిస్తూనే ఉంది.
వెతుక్కుంటూ వెళ్లి మరీ.. నిలదీసిన వ్యక్తికి ఆహ్వానం.. మాట నిలబెట్టుకున్న MLA కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి కూతురు
Kotamreddy Sridhar Reddy Daughter Sai Vaishnavi Invites Chalapathi: నెల్లూరు రూరల్ నియోజకవర్గం పొట్టేపాలెం కలుజుపై బ్రిడ్జి సమస్య తీరింది. రూ.6.54కోట్లతో కలుజుపై నిర్మించిన వంతెన ప్రారంభమైంది. ఈ వంతెనను కలెక్టర్ హిమాన్షు శుక్లా, ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, టీడీపీ నేత గిరిధర్ రెడ్డి ప్రారంభించారు. ఈ బ్రిడ్జి అందుబాటులోకి రావడంతో నాలుగు నియోజకవర్గాల ప్రజల కల నెరవేరింది. ఎన్నికల ప్రచార సమయంలో వంతెన నిర్మాణంపై ప్రశ్నించిన వారిని ప్రారంభోత్సవానికి తీసుకువచ్చామని కోటంరెడ్డి కుమార్తె సాయి వైష్ణవి తెలిపారు.
‘నన్ను ఆంధ్రా బిడ్డగా భావించండి.. రాష్ట్రానికి ఏం చేయగలనో చెప్పండి’.. అనంత్ అంబానీ నోట తెలుగు మాట..
చంద్రబాబు నాయుడు గారు నన్ను ఆంధ్రా బిడ్డగా భావించండి.. ఈ రాష్ట్రానికి నావంతుగా ఏం చేయగలనో చెప్పండి అంటూ రిలయన్స్ ఇండస్ట్రీస్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అనంత్ అంబానీ మాట్లాడారు. మదనపల్లెలో జరిగిన గ్లోబల్ హార్టికల్చర్ హబ్ శంకుస్థాపన కార్యక్రమం ఇందుకు వేదిక అయ్యింది. నమస్కారం, నన్ను ఆంధ్రా బిడ్డగా భావించండి.. అందరికీ ధన్యవాదములు.. చిన్న పదాలే అయినా తెలుగులో మాట్లాడటానికి ఆయన ప్రయత్నించిన తీరు అందర్నీ ఆకట్టుకుంది. దీనికి బదులుగా చంద్రబాబు మాట్లాడుతూ అనంత్ అంబానీని తెలుగు ముద్దుబిడ్డగా అభివర్ణించారు.
‘నన్ను ఆంధ్రాబిడ్డగా భావించండి’.. అనంత్ అంబానీ తెలుగు స్పీచ్
చంద్రబాబు నాయుడు గారు.. నన్ను ఆంధ్రా బిడ్డగా భావించండి. రాష్ట్రానికి నా వంతుగా ఏం చేయగలనో అడగండి అని రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ కుమారుడు అనంత్ అంబానీ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మదనపల్లెలో నిర్వహించిన గ్లోబల్ హార్టికల్చర్ హబ్ శంకుస్థాపన కార్యక్రమంలో అనంత్ ఈ వ్యాఖ్యలు చేశారు.
ఏపీలో పింఛన్లు తీసుకునేవారికి అలర్ట్.. 9.5 లక్షల మందికి బ్యాంక్ అకౌంట్లో డబ్బులు జమ.. నవంబర్ నుంచి అమలు
AP Minister Kondapalli Srinivas On NSA Pensions: ఏపీలో 9.5 లక్షల మంది పింఛన్‌దారులకు డీబీటీ చెల్లింపులు చేయనున్నట్లు మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు. నవంబర్ నెల నుంచి అమలు చేస్తామని పేర్కొన్నారు. జాతీయ సామాజిక సహాయ కార్యక్రమం పింఛన్ డబ్బుల్ని నేరుగా లబ్ధిదారులు బ్యాంక్ అకౌంట్లో జమ చేస్తారు. ముందుగా పైలట్ ప్రాజెక్ట్ కింద గజపతినగరం మండలంలో లబ్ధిదారులకు డబ్బుల్ని బ్యాంక్ అకౌంట్లలో జమ చేశారు. నవంబర్ నుంచి అందరికి డబ్బలు అకౌంట్లో జమ చేస్తారు.
40 ఏళ్ల సమస్యకు పరిష్కారం.. టీడీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి కల నిజమైంది.. పొట్టేపాలెం కలుజుపై బ్రిడ్జి పూర్తి
Nellore Rural Pottepalem Kaluju Bridge Inauguration: నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి పోరాటం ఫలించింది. దాదాపు 40 ఏళ్లుగా ప్రజలు ఎదుర్కొంటున్న సమస్య పరిష్కారం అయ్యింది. నెల్లూరు రూరల్ మండలం పొట్టేపాలెం కలుజుపై బ్రిడ్జి పూర్తయ్యింది.. ఈ నెల 2న ప్రారంభించనున్నారు. ఈ బ్రిడ్జి నిర్మాణంతో దాదాపు ఐదు నియోజకవర్గాలకు ఇబ్బందులు తొలగిపోయాయి. ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి దాదాపు 11 ఏళ్లుగా ఈ బ్రిడ్జి కోసం పోరాటం చేశారు.
వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డికి ఈడీ నోటీసులు.. ఈ నెల 14న విచారణకు రావాలని పిలుపు
Ysrcp Mp Ys Avinash Reddy Ed Notice: మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసులో కడప ఎంపీ అవినాష్ రెడ్డికి ఈడీ నోటీసులు జారీ చేసింది. ఈ నెల 14 న విచారణకు హాజరుకావాలని నోటీసులో ఈడీ అధికారులుపేర్కొన్నారు. వివేకా కేసులో రూ.40 కోట్ల డీల్ జరిగిందనే అంశంపై ఈడి ఆరా తీస్తోంది. ఇప్పటికే దస్తగిరితో పాటుగా ఎర్రగంగిరెడ్డి, సునీల్‌యాదవ్, ఉమాశంకర్‌రెడ్డిని ఈడీ అధికారులు ప్రశ్నించారు. తాజాగా అవినాష్ రెడ్డికి నోటీసులు ఇచ్చారు.
కోనసీమవాసుల కల నిజం కాబోతున్న వేళ.. కోటిపల్లి-నరసాపురం కొత్త రైల్వే లైన్‌కు రూ.100 కోట్లు విడుదల
Rs 100 Crores For Kotipalli Narsapur Railway Line: కోనసీమ ప్రాంతానికి రైల్వేలైన్ అనుసంధానంలో మరో ముందడుగుపడింది. కోటిపల్లి-నర్సాపూర్ రైల్వే లైన్ కోసం ఏపీ ప్రభుత్వం నిధులు కేటాయించింది. రాష్ట్ర వాటా కింద ప్రభుత్వం రూ.100 కోట్లు మంజూరు చేసింది. ఈ నిధులు భూసేకరణకు కేటాయించనున్నారు. ఏపీ ప్రభుత్వం భూసేకరణ, సివిల్ వర్క్ ఖర్చులతో సహా ప్రాజెక్టు మొత్తం వ్యయంలో 25 శాతం భరించాల్సి ఉంటుంది. ఏపీ సర్కార్ నిధులు విడుదల చేయడంతో పనులు వేగవంతంకానున్నాయి.
SRI KASHI NAYANA DAILY – 2 అక్టోబర్ 2026
మెగా హ్యాండ్లూమ్ క్లస్టర్ భూమిపూజకు ఏర్పాట్లు ముమ్మరం
కదిరి గేట్ ROB బాధితులతో హరీష్ బాబు, RDO సమావేశం
పిడుగుపాటుకు 21 గొర్రెలు మృతి – బాధితుడికి మంత్రి భరోసా
గాయత్రి మసాలాస్ ప్రొప్రైటర్ గౌతమ్ కు కలెక్టర్ అభినందన
న్యాయవాదులపై దాడి దారుణం – బార్ అసోసియేషన్ నిరసన
సజావుగా NTR భరోసా పెన్షన్ పంపిణీ – కమిషనర్ రమణయ్య

