ఖైరతాబాద్ అసెంబ్లీ నియోజకవర్గ ఉపఎన్నికపై ఉత్కంఠ కొనసాగుతోంది. 2023 ఎన్నికల్లో దానం నాగేందర్‌పై పోటీ చేసిన కాంగ్రెస్ నాయకురాలు విజయారెడ్డి.. ఆయన ఎన్నికను సవాల్ చేస్తూ గతంలోనే హైకోర్టును ఆశ్రయించారు. దానం ఎన్నిక చెల్లదని తేలితే తనను ఎమ్మెల్యేగా ప్రకటించే అవకాశం ఉందని ఆమె తాజాగా వ్యాఖ్యానించారు. ఎన్నికల పిటిషన్లో తీర్పు రాకముందే అదే స్థానానికి ఉపఎన్నిక నిర్వహించడంపై గతంలో సుప్రీంకోర్టు వెలువరించిన న్యాయ సూత్రాలను ఆమె ప్రస్తావించారు. మరోవైపు పార్టీ ఫిరాయింపు కేసులో దానం అనర్హతకు గురై ఖైరతాబాద్ స్థానం ఖాళీగా మారింది. దీంతో విజయారెడ్డి పిటిషన్‌పై హైకోర్టు నిర్ణయం ఇప్పుడు కీలకంగా మారింది.
ఐసీసీ కొత్త రూల్స్.. పగటి పూట పింక్ బాల్ టెస్టులు.. టైమ్ వేస్ట్ చేస్తే 5 రన్స్ పెనాల్టీ!
అంతర్జాతీయ క్రికెట్లో ఐసీసీ కొత్త ప్లేయింగ్ కండిషన్స్ అమల్లోకి తెచ్చింది. వెలుతురు లేమి సమస్యను నివారించేందుకు పగటి పూట పింక్ బాల్ వాడే ట్రయల్స్‌కు అనుమతిచ్చింది. బ్యాటర్లు సమయం వేస్ట్ చేస్తే తొలి రెండు సార్లు హెచ్చరించి, మూడోసారి నుంచి ప్రత్యర్థి జట్టుకు 5 పెనాల్టీ పరుగులు కేటాయిస్తుంది. వైడ్ బాల్ నిబంధనను పర్మినెంట్ చేయడంతో పాటు, రనౌట్/స్టంపింగ్స్ కోసం బంతిపై ‘పూర్తి నియంత్రణ’ తప్పనిసరి చేస్తూ నిబంధనలను స్పష్టం చేసింది.
2027 వన్డే ప్రపంచకప్ ఫార్మాట్ ఏంటి? గ్రూప్‌లు, జట్ల వివరాలు ఇవే..!
2027 వన్డే ప్రపంచకప్ అక్టోబర్ 2 నుంచి నవంబర్ 21 వరకు దక్షిణాఫ్రికా, జింబాబ్వే, నమీబియా వేదికలుగా జరగనుంది. 2015 తర్వాత మళ్లీ 14 జట్లు పాల్గొంటున్న ఈ టోర్నీని ఐసీసీ మూడు దశల్లో నిర్వహించనుంది. మూడు క్వాలిఫయర్ల మధ్య ‘సూపర్ సిరీస్’, ఆపై 6 జట్ల చొప్పున రెండు గ్రూప్‌ల లీగ్ స్టేజ్ మ్యాచులు జరుగుతాయి. ఆపై టాప్-7 జట్లతో ‘సూపర్ 7’ రౌండ్ జరగనున్నాయి. చివరగా టాప్-4 జట్లు సెమీస్, ఫైనల్ ఆడనున్నాయి.
అభిమానులకు గుడ్ న్యూస్.. ఒకే ప్రపంచకప్‌లో 3 సార్లు భారత్ vs పాక్ మ్యాచ్..!
2027 ఐసీసీ వన్డే ప్రపంచకప్‌లో భారత్, పాకిస్థాన్ జట్లు ఏకంగా మూడుసార్లు తలపడే అవకాశముంది. గ్రూప్-ఏ లో ఉన్న ఇరు జట్లు అక్టోబర్ 10న జొహన్నెస్‌బర్గ్‌లో తొలిసారి ఢీకొంటాయి. ఇరు జట్లు సూపర్ 7 దశకు అర్హత సాధిస్తే నవంబర్ 7న కేప్‌టౌన్‌లో రెండోసారి తలపడతాయి. నాకౌట్స్ లేదా ఫైనల్ చేరితే నవంబర్ 17/18 లేదా 21న మూడోసారి పోరాడే అవకాశం ఉంది. ప్రపంచకప్‌లో పాక్‌పై భారత్‌కు 8-0 అజేయ రికార్డు ఉంది.
పంజాబ్‌లో కాంగ్రెస్‌కు బిగ్ షాక్.. పీసీపీ అధ్యక్ష పదవికి అమరీందర్ సింగ్ రాజా రాజీనామా
వచ్చే ఏడాది మార్చి- ఏప్రిల్‌లో పంజాబ్ అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్నాయి. ఆ రాష్ట్రంలో అధికారంపై కాంగ్రెస్ పార్టీ భారీ ఆశలు పెట్టుకుంది. ఇలాంటి తరుణంలో పంజాబ్ పీసీసీ చీఫ్ పదవి నుంచి తప్పుకోవడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఆ రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు అమరీందర్ సింగ్ రాజా వారింగ్ తన రాజీనామా లేఖను అగ్రనేత రాహుల్ గాంధీకి సమర్పించారు. అయితే, తనపై ఎటువంటి ఒత్తిడి లేదని ఆయన పేర్కొన్నారు. వారింగ్ స్థానంలో హిందూ నేత ఇందర్ సింగ్లాకు అవకాశం ఇవ్వనున్నట్టు సమాచారం.
SIRపై నిరసనలతో జంతర్ మంతర్ వద్ద ఉద్రిక్తత.. ఇంటర్నెట్ నిలిపివేత, పోలీసుల అదుపులో 700 మంది
ఎస్ఐఆర్, సీఈసీ జ్ఞానేష్ కుమార్‌కు వ్యతిరేకంగా ప్రతిపక్షాలు తమ పోరాటాన్ని ఉద్ధృతం చేశాయి. అటు, కాక్రోచ్ జనతా పార్టీ సైతం అక్టోబరు 2 నుంచి దీనిపై ఉద్యమాన్ని ప్రారంభించింది. దేశ రాజధాని ఢిల్లీతో పాటు ముంబయిలో సీజేపీ ఆందోళన మొదలైంది. అయితే, జంతర్ మంతర్ వద్ద ఆప్, కాంగ్రెస్ పార్టీలు కూడా నిరసనల్లో పాల్గొన్నాయి. దీంతో అక్కడ ఉద్రిక్తత నెలకుంది. ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా వందల మందిని అరెస్ట్ చేసిన పోలీసులు.. ఇంటర్నెట్ నిలిపివేశారు.
“హనుమాన్ చాలీసానే ధైర్యాన్నిచ్చింది.. దానివల్లే గాయపడ్డా ప్రయాణికులను కాపాడాను”: ప్రధాని మోదీతో స్మిత్ మచ్చర్
దుబాయ్-టెల్ అవీవ్ ఫ్లైదుబాయ్ విమానంలో కో-పైలట్ దాడిని తిప్పికొట్టి 170 మందికి పైగా ప్రయాణికులను కాపాడిన కెప్టెన్ స్మిత్ మచ్చార్‌తో ప్రధాని నరేంద్ర మోదీ వీడియో కాల్ ద్వారా మాట్లాడారు. తీవ్ర గాయాలతో ఆసుపత్రి బెడ్‌పై ఉండి చికిత్స పొందుతున్న స్మిత్ మచ్చర్ కన్నీటిపర్యంతమవుతూ.. తాను గాయపడినా ప్రయాణికులను చావనివ్వకూడదనే ఉద్దేశంతో కాక్‌పిట్ తలుపులు తెరిచానని, ఆ సమయంలో హనుమాన్ చాలీసా జపించానని ప్రధాని మోదీకి వివరించారు. ఆపూర్తి వివరాలు మీకోసం.
రూ.70 వేల బైకుకు రూ.10 లక్షల జరిమానా.. ఒకటి కాదు రెండు ఏకంగా 126 చలాన్లు పడడంతో అంతా షాక్!
గురుగ్రామ్‌లో ట్రాఫిక్ పోలీసులు నిర్వహించిన తనిఖీల్లో రూ.70,000 విలువ చేసే ఒక పాత మోటార్ సైకిలుపై ఏకంగా 126 పెండింగ్ చలాన్లు ఉన్నట్లు బయటపడింది. ఆ చలాన్ల జరిమానా మొత్తం రూ.10,30,000గా తేలడంతో పోలీసులు, వాహనదారుడు షాక్ తిన్నారు. హెల్మెట్, పొల్యూషన్ పత్రాలు, నంబరు ప్లేటు లేకపోవడంతో నమోదైన ఈ భారీ జరిమానా కేసులో పోలీసులు వాహనాన్ని సీజ్ చేశారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వార్త నెట్టింట వైరల్ అవుతుండగా.. అంతా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.
జమ్మూ కశ్మీర్లో ఘోరం.. తోటి జవాన్లపై సైనికుడి కాల్పులు.. అధికారి సహా నలుగురు మృతి!
జమ్మూ కశ్మీర్‌లోని కథువా జిల్లా సెవా పవర్ ప్రాజెక్ట్ వద్ద దారుణం చోటుచేసుకుంది. సీఐఎస్ఎఫ్ క్యాంప్‌లోని జవాన్ల మధ్య తలెత్తిన వివాదం కారణంగా హెడ్ కానిస్టేబుల్ అవధేష్ కుమార్ సింగ్ తన వద్ద ఉన్న ఏకే-47తో విచక్షణారహితంగా కాల్పులు జరిపాడు. ఈ ఘోర ఘటనలో అసిస్టెంట్ కమాండెంట్‌తో సహా నలుగురు సీఐఎస్ఎఫ్ సిబ్బంది ప్రాణాలు కోల్పోగా.. నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేసి విచారణ ప్రారంభించారు. ఆ పూర్తి వివరాలు మీకోసం.
రూ.5.10 లక్షలకే సొంత ఇల్లు, పేద, మధ్య తరగతి వాసుల కోసం కొత్త టెక్నాలజీ, తొలిసారిగా ఏపీలోనే శ్రీకారం
ఏపీ వాసులకు గుడ్‌న్యూస్. కేవలం రూ.5.10 లక్షలకే సొంత ఇల్లును నిర్మించుకునే రోజులు వచ్చేశాయ్. భవన నిర్మాణంలో ‘త్రీడీ (3D) కాంక్రీట్ ప్రింటింగ్’ టెక్నాలజీతో ఇళ్లు నిర్మించే సరికొత్త ప్రాజెక్టుకు ఆంధ్రప్రదేశ్ నుంచే అంకురార్పణ జరగబోతుంది. మొదటి దశలో భాగంగా బుర్రిపాలెంలో 100 త్రీడీ ఇళ్లను నిర్మించడం జరుగుతుంది. వీటితో పాటు గుంటూరు రూరల్ పరిధిలోని ఓబుల్నాయుడుపాలెంలో దివ్యాంగుల కోసం ప్రత్యేకంగా డిజైన్ చేసిన మరో 77 ఇళ్లను నిర్మించి వారికి ఇవ్వనున్నారు. సాధారణంగా ఇళ్లు నిర్మించడానికి కొన్ని నెలల సమయం పడుతుంది.. కానీ ఈ టెక్నాలజీలో ఇళ్ల నిర్మాణం చాలా తక్కువ సమయంలోనే పూర్తైపోతాయి.

