అల్యూమినీయం, స్టీల్ వంటపాత్రలతో ఏదో ఓ విషయంలో విసుగెత్తిపోయిన వారు ఎక్కువగా సెరామిక్ వంటపాత్రలకి షిఫ్ట్ అవుతున్నారు. ఇవి చూడ్డానికి అందంగా ఉండడమే కాదు, సౌకర్యంగా కూడా ఉంటాయి. వీటిలో వంట చేస్తే త్వరగా అడుగంటవు. గీతలు పడకుండా ఎక్కువ రోజులు చక్కగా ఉంటాయి. ఈ రకం పాత్రల్లో ఫుడ్‌ని స్టోర్ చేసుకుంటే చాలా మంచిది. ఫుడ్‌ని వేడి చేయడానికి వీటిని మైక్రోవేవ్‌లో పెట్టి కూడా వాడొచ్చు. ఇన్ని లాభాలున్నాయి కాబట్టే, చాలా మంది ఈ సెరామిక్ పాత్రల్ని వాడడానికి ఇష్టపడతారు. ఇలాంటి పాత్రల్ని వాడడమే కాదు. మెంటెయిన్ చేయడం ఎలానో కూడా తెలిసి ఉండాలి.
5,10 లేదా 20 నిమిషాలు.. షుగర్ తగ్గాలంటే భోజనం తర్వాత ఎంతసేపు నడవాలో తెలుసా?
వాకింగ్ వల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుంది. ముఖ్యంగా భోజనం తర్వాత కాసేపు అటూఇటూ నడవడం శరీరానికి ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. ఆహారం తీసుకున్న తర్వాత కండరాలు కదలడం వల్ల అవి రక్తంలోని గ్లూకోజ్‌ను శక్తిగా వినియోగించుకుంటాయి. దీనివల్ల భోజనం తర్వాత రక్తంలో షుగర్ లెవల్స్ (Blood Sugar Spikes) అకస్మాత్తుగా పెరగకుండా అదుపులో ఉంటాయి.
ఎక్కువ సేపు ఒకే చోట కూర్చోకుండా మధ్యమధ్యలో లేచి కొన్ని నిమిషాలు నడవడం వల్ల గ్లూకోజ్ స్థాయిలు మెరుగుపడతాయని పరిశోధనలు చెబుతున్నాయి. 53 అధ్యయనాల ఆధారంగా ‘ఒబేసిటీ రివ్యూస్’ ప్రచురించిన మెటా-విశ్లేషణ ప్రకారం… కూర్చునే సమయానికి బ్రేక్ ఇస్తూ నడవడం వల్ల భోజనం తర్వాత గ్లూకోజ్, ఇన్సులిన్ ప్రతిస్పందనలు తగ్గుతాయని స్పష్టమైంది. అయితే, ఎన్ని నిమిషాలు నడిస్తే మంచిదో ఇప్పుడు తెలుసుకుందాం.
Fatty Liver Diet: లివర్‌లో కొవ్వు కరిగించే 5 రకాల అద్భుతమైన కూరగాయలు, ఏమేం తినాలో తెలుసా?
ప్రస్తుత ఉరుకుల పరుగుల జీవితంలో లైఫ్‌స్టైల్ మార్పులు, సరైన సమయానికి భోజనం చేయకపోవడం, పోషకాహార లోపం, నిద్రలేమి కారణంగా ఎన్నో అనారోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి. వీటిలో డయాబెటిస్, ఫ్యాటీ లివర్ (కాలేయంలో కొవ్వు చేరడం) ప్రధానమైనవి. అయితే, ఫ్యాటీ లివర్ సమస్యతో బాధపడుతున్నవారు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఆహారపు అలవాట్లను మార్చుకోవడం, సరైన జీవనశైలిని పాటించడం ద్వారా కాలేయ ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవచ్చు. ఫ్యాటీ లివర్ని నయం చేయడానికి తినాల్సిన కూరగాయల గురించి డాక్టర్ రమాకాంత్ రెడ్డి ఎ, (కన్సల్టెంట్ – మెడికల్ గ్యాస్ట్రోఎంటరాలజీ, గ్లెనీగల్స్ అవేర్ హాస్పిటల్ (ఫోర్టిస్ హెల్త్‌కేర్ నెట్వర్క్), ఎల్బీ నగర్, హైదరాబాద్) తెలిపారు.
DA Hike: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్‌న్యూస్.. దసరాకు ముందే డీఏ పెంపు! జీతం ఎంత పెరుగుతుందంటే?
Central Govt Employees DA Hike: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు ఏటా రెండు సార్లు కేంద్రం డీఏ, డీఆర్ ప్రకటిస్తుందన్న సంగతి తెలిసిందే. తొలి అర్ధభాగంలో ఏప్రిల్ నెలలో డీఏ పెంపు ప్రకటించగా ఇప్పుడు రెండో అర్ధభాగంలో డీఏ, డీఆర్ పెంపు ప్రకటన కోసం ఎదురుచూస్తున్నారు. ఈసారి డీఏ 3-4 శాతం వరకు పెరిగి 63-64 శాతం వరకు పెరగొచ్చని అంచనా. అయితే ఈసారి దసరాకు ముందే ప్రకటన రావొచ్చని ఉద్యోగ సంఘాల ప్రతినిధులు భావిస్తున్నారు.
షాపింగ్ మాల్స్ కంటే హైస్ట్రీట్ షాపులకే డిమాండ్.. లీజింగ్‌లో భారీ మార్పు.. ఏకంగా 38 శాతం పతనం!
Retail Leasing India 2026: దేశంలో రియల్ ఎస్టేట్ విషయానికి వస్తే తీవ్ర అనిశ్చితి నెలకొంది. ముఖ్యంగా 2026 జులై- సెప్టెంబర్ త్రైమాసికంలో 8 ప్రధాన నగరాల్లో షాపింగ్ మాల్స్‌లో రిటైల్ స్పేస్ లీజింగ్ ఏకంగా 38 శాతం తగ్గింది. ఇదే సమయంలో హైస్ట్రీట్ లీజింగ్ మాత్రం 33 శాతం పెరిగింది. ఇక్కడ ప్రీమియం మాల్ స్పేస్ కొరత, తక్కువ ఖాళీ స్థలాలు దీనికి ప్రధాన కారణంగా తెలు
SORRY SUGAR: మొదటి నెలలోనే రూ. కోటి ఆదాయం.. కాఫీ స్టార్టప్ సంచలనం.. 100 + స్టోర్లకు ప్లాన్!
Zero Sugar Coffee Brand: గురుగ్రామ్‌కు చెందిన క్లీన్ లేబుల్ బేవరేజ్ స్టార్టప్ సారీ షుగర్ (SORRY SUGAR) ప్రారంభించిన తొలి నెలలోనే ఏకంగా రూ. 1 కోటికిపైగా ఆదాయం ఆర్జించింది. తొలి సీడ్ రౌండ్లో ఒక మిలియన్ డాలర్లు సమీకరించిన సంస్థ 2027 చివరి నాటికి ఏకంగా 100కుపైగా స్టోర్లను ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. ప్రస్తుతం దీనికి దిల్లీ, గురుగ్రామ్‌లో కలిపి 3 స్టోర్లు ఉన్నాయి.
రూ. 15 వేల సిప్‌తో 15 ఏళ్లలోనే కోటీశ్వరులయ్యారు.. ఈ 10 మ్యూచువల్ ఫండ్ స్కీమ్స్‌తో పట్టిందల్లా బంగారమే!
Best Mutual Funds SIP: మ్యూచువల్ ఫండ్స్ దీర్ఘకాలంలో మంచి రిటర్న్స్ ఇస్తుంటాయని నిపుణులు చెబుతుంటారు. ఇక్కడ చిన్న మొత్తాల్లో పెట్టుబడితోనూ ఆర్థిక క్రమశిక్షణతో ఇన్వెస్ట్ చేస్తే లాంగ్ రన్లో మెరుగైన రాబడి వస్తుంది. కాంపౌండింగ్ ఇంట్రెస్ట్ కారణంగా ఇక్కడ సంపద విపరీతంగా పెరుగుతుంటుంది. కొన్ని మ్యూచువల్ ఫండ్ స్కీమ్స్ కేవలం రూ. 15 వేల సిప్ పెట్టుబడి పెట్టిన వారిని 15 ఏళ్లలో కోటీశ్వరుల్ని చేయడం విశేషం. వీటి గురించి ఇప్పుడు చూద్దాం.
BSNL రూ.51 ప్లాన్.. అపరిమిత కాల్స్+ రోజుకు 2GB+ 28 రోజుల వ్యాలిడిటీ.. ఈ నెలాఖరు వరకే ఛాన్స్!
BSNL Rs 51 Plan: ఓ వైపు మొబైల్ రీఛార్జ్ ధరలు పెరుగుతున్న తురణంలో బీఎస్ఎన్ఎల్ సరికొత్త ప్లాన్లతో కస్టమర్లను ఆకర్షించే ప్రయత్నం చేస్తోంది. కొత్త యూజర్ల కోసం రూ. 51 ప్లాన్ తీసుకొచ్చింది. ఇందులో అపరిమిత కాల్స్, రోజుకు 2జీబీ డేటాతో 28 రోజుల వ్యాలిడిటీని కలిగి ఉన్న ప్లాన్ తీసుకొచ్చింది. అక్టోబర్ 31వ తేదీలోపు కొనే వారికే వర్తిస్తుంది. మరి ఈ ప్లాన్ గురించిన వివరాలు తెలుసుకుందాం.
పశ్చిమాసియాకు మరో 10 వేల మంది సైనికులతో అమెరికా మూడో యుద్ధ నౌక.. ఇరాన్‌పై మళ్లీ భారీ దాడి?
పశ్చిమాసియాలో యుద్ధానికి శుభం కార్డు వేయడానికి డొనాల్డ్ ట్రంప్ సిద్ధంగా లేరని ఆయన చేస్తోన్న ప్రకటనలు స్పష్టం చేస్తున్నాయి. అమెరికాలో మధ్యంతర ఎన్నికల వేళ.. మళ్లీ పశ్చిమాసియాకు భారీ ఎత్తున బలగాలను పంపడం చర్చనీయాంశంగా మారింది. నవంబరు 3న ఎన్నికలు జరగనున్నాయి. దీని తర్వాత ఇరాన్‌పై దాడికి ప్లాన్ చేస్తున్నట్టు నివేదికలు అందుతున్నాయి. ఈ క్రమంలోనే మూడో విమానవాహక నౌక, మరో 10 వేల మంది సైనికులను అమెరికా పంపుతోంది.
ఇజ్రాయెల్ భద్రతా వైఫల్యంతోనే ఫ్లైదుబాయ్ విమానంలో ఘటన.. వెలుగులోకి సంచలన విషయాలు
రెండు రోజుల కిందట దుబాయ్ నుంచి టెల్ అవీవ్‌కు ప్రయాణికులతో బయలుదేరిన ఫ్లైదుబాయ్ ఎయిర్‌లైన్స్ విమానంలో చోటుచేసుకున్న ఘటన యావత్తు ప్రపంచాన్ని ఉలిక్కి పడేలా చేసింది. కాక్‌పిట్‌లో కెప్టెన్‌పై దాడిచేసిన కో- పైలట్ విమానాన్ని కూల్చివేయడానికి ప్రయత్నించాడు. అయితే, ఇజ్రాయెల్‌తో దౌత్య సంబంధాలు లేని ఒమాన్ దేశానికి చెందిన పౌరుడు టెల్ అవీవ్‌కు వెళ్లే విమానం నడపడానికి అనుమతించడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అయితే, దీనికంతటికి ఇజ్రాయెల్ భద్రతా వైఫల్యమే కారణమని తాజాగా నివేదిక ఒకటి పేర్కొంది.

