Home Blog Page 194

మళ్లీ ఉద్రిక్తతలు: గిఫ్ట్ నిఫ్టీ ప్రతికూల సంకేతాలు.. నేడు కొనాల్సిన 8 షేర్లు ఇవే

0

పశ్చిమాసియాలో ముదిరిన యూఎస్-ఇరాన్ ఘర్షణలు, పెరుగుతున్న ముడిచమురు ధరల ప్రభావంతో మంగళవారం భారతీయ స్టాక్ మార్కెట్లు నష్టాలతో ప్రారంభమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. గిఫ్ట్ నిఫ్టీ ప్రతికూల సంకేతాలు ఇస్తుండగా, ఇంట్రాడే ట్రేడింగ్ కోసం మార్కెట్ నిపుణులు 8 షేర్లను సిఫార్సు చేశారు.

LPG Price: ఒకటో తేదీ షాక్.. పెరిగిన వాణిజ్య గ్యాస్ సిలిండర్ ధర.. హైదరాబాద్‌ సహా నగరాల వారీగా కొత్త రేట్లు ఇవే..

0

LPG Price: వంట గ్యాస్ వినియోగదారులకు మరోసారి ధరల షాక్ తగిలింది. వాణిజ్య ఎల్‌పీజీ గ్యాస్ సిలిండర్ ధరలను పెంచుతూ చమురు మార్కెటింగ్ కంపెనీలు నిర్ణయం తీసుకున్నాయి. అయితే, గృహ వినియోగ సిలిండర్ ధరల్లో ఎలాంటి మార్పు చేయలేదు. ఒక్కో కమర్షియల్ సిలిండర్‌పై రూ. 9.50 పైన పెంచినట్లు తెలిపాయి. దీంతో వినియోగదారులపై అదనపు భారం పడనుంది. ఈ క్రమంలో ఢిల్లీ, హైదరాబాద్ సహా నగరాల వారీగా కొత్త రేట్లు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.

సుప్రీంకోర్టు జడ్జినంటూ సుకేష్ చంద్రశేఖర్‌ బెదిరింపులు.. 8 ఏళ్ల జైలుశిక్ష వేసిన న్యాయస్థానం

ఒక కేసులో బెయిల్ పొందేందుకు ఏకంగా సుప్రీంకోర్టు న్యాయమూర్తినంటూ నటిస్తూ స్పెషల్ జడ్జీని బెదిరింపులకు గురిచేసిన నేరగాడు సుకేష్ చంద్రశేఖర్‌కు ఢిల్లీ కోర్టు 8 ఏళ్ల జైలు శిక్ష విధించింది. విచారణ సందర్భంగా ప్రభుత్వ ఉద్యోగిలా నటించడం, బెదిరించడం వంటి నేరాలకు గాను విడివిడిగా శిక్షలు ఖరారు చేసి, అవన్నీ ఒకదాని తర్వాత ఒకటి అమలయ్యేలా జడ్జి తీర్పును ఇచ్చారు. న్యాయవ్యవస్థ సత్యనిష్ఠను దెబ్బతీసేలా సుకేష్ పాల్పడిన ఈ చర్య తీవ్రమైన వ్యవస్థాగత ద్రోహమని కోర్టు మండిపడింది.

భారీ నష్టాల్లో భూగర్భ బొగ్గు గనులు.. ప్రైవేటుకు అప్పగించేందుకు సిద్ధమైన సింగరేణి..!

0

భారీ నష్టాల్లో కొనసాగుతున్న భూగర్భ బొగ్గు గనులను మైన్ డెవలప్‌మెంట్ అండ్ ఆపరేషన్ (ఎండీవో) విధానంలో ప్రైవేటు సంస్థలకు అప్పగించేందుకు సింగరేణి పరిశీలిస్తోంది. ప్రయోగాత్మకంగా మందమర్రిలోని శాంతిఖని గనిని అప్పగించేందుకు లెటర్ ఆఫ్ ఇంట్రెస్ట్ కోరగా ఒక సంస్థ ముందుకొచ్చింది. శాంతిఖనిలో టన్ను ఉత్పత్తికి రూ.21,558 ఖర్చవుతుండగా విక్రయ ధర రూ.4,167 మాత్రమే. 2025 చివరి నాటికి 22 యూజీ గనుల్లో 21 నష్టాల్లో ఉండగా.. వాటి మొత్తం నష్టం రూ.1,924 కోట్లకు పైగా ఉంది. ఓసీ గనుల లాభాలతోనే యూజీ నష్టాలను భర్తీ చేస్తున్నారు.

బడికి పుస్తకం తేలేదని రోజంతా ఎండలో నిలబెట్టిన టీచర్.. పదేళ్ల చిన్నారి మృతి!

దేశ రాజధాని ఢిల్లీలోని తూర్పు వినోద్ నగర్ సర్వోదయ కన్యా విద్యాలయలో తీవ్ర హృదయ విదారక ఘటన చోటుచేసుకుంది. పాఠశాలకు పుస్తకం తెచ్చుకోలేదనే చిన్న కారణంతో ఉపాధ్యాయురాలు వేసిన కఠిన దండనకు పింకీ అనే పదేళ్ల విద్యార్థిని బలైపోయింది. తీవ్రమైన ఎండలో గంటల తరబడి నిలబెట్టడంతో ఆరోగ్యం క్షీణించగా.. ఉపాధ్యాయులు ఇచ్చిన సమాచారంతో ఆమె తల్లి అక్కడకు చేరుకుంది. వెంటనే కుమార్తెను ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ చిన్నారి కన్నుమూసింది. ఆ పూర్తి వివరాలు మీకోసం.

Hyderabad MMTS : హైదరాబాద్ చుట్టూ ఎంఎంటీఎస్, ఫ్యూచర్ రైలు కారిడార్లు!

0

Hyderabad MMMTS :హైదరాబాద్ చుట్టూ ఎంఎంటీఎస్ విస్తరణ, ఫ్యూచర్ రైలు కారిడార్ల కోసం తెలంగాణ ప్రభుత్వం, దక్షిణ మధ్య రైల్వే డీపీఆర్‌లను సిద్ధం చేయనున్నాయి. ఈ మేరకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.

Ninnu Kori September 1 Episode: నిన్ను కోరి- నిశ్చితార్థంలోపు మదన్‌ను నరికేస్తా- విరాట్ వార్నింగ్- చంద్రకళపై మాయ డౌట్

0

Ninnu Kori Serial September 1st Episode: నిన్ను కోరి సీరియల్ సెప్టెంబర్ 1వ ఎపిసోడ్‌‌లో విరాట్ కత్తి నూరుతుంటాడు. నా భార్యకు వేరేవాడితో ఎంగేజ్‌మెంట్ చేయాలని చూస్తే నేను ఊరుకుంటానా. నిశ్చితార్థంలోపు వాడిని నేను నరికేస్తా అని విరాట్ వార్నింగ్ ఇస్తాడు. చంద్రకళ కావాలనే విరాట్‌ను రెచ్చగొడుతుంది.

ఐటీ నిపుణులకు అమెరికా షాక్: హెచ్-1బీ 60 రోజుల గ్రేస్ పీరియడ్‌ రద్దు?

0

అమెరికాలో ఉద్యోగం కోల్పోయిన విదేశీ నిపుణులకు ఇచ్చే 60 రోజుల గ్రేస్ పీరియడ్‌ను తొలగించే ప్రతిపాదనపై వైట్‌హౌస్ సమీక్ష పూర్తయింది. ఈ నిబంధన గనక అమలులోకి వస్తే, ఉద్యోగం పోయిన వెంటనే దేశం విడిచి వెళ్లాల్సి వస్తుంది. వేలాది మంది భారతీయ ఐటీ నిపుణులు, వారి కుటుంబాలపై ఇది తీవ్ర ప్రభావం చూపనుంది.

అమెరికా గ్రీన్ కార్డ్ కష్టాలు: ఇప్పుడు దరఖాస్తు చేస్తే 179 ఏళ్లు పడుతుంది

0

అమెరికాలో శాశ్వత నివాస అర్హత సాధించాలనుకునే భారతీయ నిపుణులకు షాకింగ్ వాస్తవాలు వెల్లడయ్యాయి. ప్రస్తుతం దరఖాస్తు చేసుకునే హెచ్-1బీ హోల్డర్లు గ్రీన్ కార్డ్ పొందేందుకు ఏకంగా 179 ఏళ్లు వేచిచూడాల్సి వస్తుందని ‘నేషనల్ ఫౌండేషన్ ఫర్ అమెరికన్ పాలసీ’ విశ్లేషణలో తేలింది.

Best electric scooter : ఆ రెండు ఎలక్ట్రిక్ స్కూటర్లకు ఏథర్​ కోనార్క్ గట్టి పోటీ.. ఏది బెస్ట్?

0

ఏథర్ ఎనర్జీ సరికొత్త ‘కోణార్క్’ ఎలక్ట్రిక్ స్కూటర్‌ను రూ.99,999 ప్రారంభ ధరతో మార్కెట్లో విడుదల చేసింది. టీవీఎస్ ఐక్యూబ్, బజాజ్ చేతక్ స్కూటర్లకు పోటీగా వచ్చిన ఈ మోడల్ ధర, బ్యాటరీ, రేంజ్ వివరాల సమగ్ర వివరాలను ఇక్కడ చూడండి..