AP NTR Bharosa Pension Scheme : ఎన్టీఆర్ భరోసా సామాజిక భద్రత పింఛన్ల దరఖాస్తు గడువును ఏపీ సర్కార్ ఈ నెల 18 వరకు పొడిగించింది. అర్హులైన అభ్యర్థులు స్థానిక స్వర్ణ గ్రామ, వార్డు సచివాలయాల్లో దరఖాస్తు చేసుకోవచ్చు.
కేసీఆర్ ఫాంహౌస్‌పై విచారణకు సీఎం రేవంత్ ఆదేశాలు.. కలెక్టర్, మంత్రులకు 30 రోజుల డెడ్‌లైన్
కేసీఆర్ ఫాంహౌస్‌పై విచారణకు ఆదేశాలు జారీ చేస్తూ అసెంబ్లీ వేదికగా సీఎం రేవంత్ రెడ్డి సంచలన ప్రకటన చేశారు. కేసీఆర్ ఫాంహౌస్ పరిసరాల్లో ఉన్న ప్రైవేటు భూమి ఎంత, ప్రభుత్వ భూమి ఎంత అనే లెక్క తేల్చాలని కలెక్టర్, అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఈ విచారణ పర్యవేక్షణ బాధ్యతను ముగ్గురు మంత్రులకు అప్పగించారు. నెలరోజుల్లోగా కేసీఆర్ ఫాంహౌస్ భూముల లెక్కలు తీయకపోతే అధికారులు, మంత్రులపై చర్యలు తీసుకునేందుకు కూడా వెనుకాడబోమని సీఎం స్పష్టం చేశారు. ప్రభుత్వ భూమి తేలితే.. అక్కడే దళితులకు పంపిణీ చేస్తామని ప్రకటించారు.
డాక్టర్ ప్రిస్క్రిప్షన్‌లో ఇవన్నీ ఉండాల్సిందే.. ఎన్‌హెచ్‌ఎం కీలక మార్గదర్శకాలు
రోగుల భద్రత, వైద్యసేవల నాణ్యత పెంపు లక్ష్యంగా ఎన్‌హెచ్‌ఎం కొత్త ప్రిస్క్రిప్షన్ ఆడిట్ మార్గదర్శకాలను విడుదల చేసింది. ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రుల్లో ప్రిస్క్రిప్షన్లను క్రమం తప్పకుండా పరిశీలించాలని రాష్ట్ర వైద్యారోగ్యశాఖను సూచించింది. రోగి పూర్తి వివరాలు, మెడికల్ హిస్టరీ, అలెర్జీలు, పరీక్షల ఫలితాలు, మందుల ఫార్ములా, మోతాదు, వినియోగించే విధానం, తదుపరి రివ్యూ తేదీ స్పష్టంగా రాయాలి. రోగికి అనవసర యాంటీబయాటిక్స్, సిరప్‌లు, ఇంజెక్షన్ల వాడకాన్ని తగ్గించడంపైనా ప్రత్యేక దృష్టి పెట్టనున్నారు. ఫార్మకాలజిస్టులు, క్లినికల్ ఫార్మకాలజిస్టులు ఈ ఆడిట్లను నిర్వహించనున్నారు.
తెలంగాణలో మళ్లీ జోరు వానలు.. మూడు రోజుల పాటు భారీ వర్షాలు, హెచ్చరికలు జారీ
తెలంగాణలో సెప్టెంబరు 19 నుంచి మూడు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ మేరకు ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లాలకు ఎల్లో అలెర్ట్ జారీ చేసింది. 20, 21 తేదీల్లోనూ పలుచోట్ల భారీ వర్షాలు పడే అవకాశముందని చెప్పారు. రాష్ట్రంలో ఇప్పటికీ 18 జిల్లాల్లో వర్షాభావ పరిస్థితులు కొనసాగుతున్నాయన్నారు. 621 మండలాల్లో 323 మండలాల్లో తక్కువ వర్షపాతం నమోదు కాగా.. ఈ సీజన్‌లో 19 శాతం లోటు ఉండటంతో పంటల సాగు విస్తీర్ణం తగ్గింది. లక్ష్యంతో పోలిస్తే వరి సాగు 10.58 లక్షల ఎకరాలు తగ్గింది.
‘హైదరాబాద్‌ను ఉస్మానిస్థాన్‌గా మార్చాలని నిజాం కుట్ర’
సెప్టెంబరు 17ను తెలంగాణ విమోచన దినోత్సవంగా అధికారికంగా నిర్వహించకపోవడానికి కాంగ్రెస్, భారాస ఓటుబ్యాంకు రాజకీయాలే కారణమని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రామచందర్‌రావు ఆరోపించారు. ఎంఐఎంకు రెండు పార్టీలు భయపడుతున్నాయని విమర్శించారు. హైదరాబాద్‌లో బీజేపీ మహిళా మోర్చా నిర్వహించిన మహిళా శక్తి ర్యాలీలో కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డితో కలిసి ఆయన పాల్గొన్నారు. నిజాం, రజాకార్లకు వ్యతిరేకంగా జరిగిన పోరాటంలో మహిళల పాత్రను ఈ సందర్భంగా కిషన్ రెడ్డి గుర్తుచేశారు. సెప్టెంబరు 17న సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లో కేంద్రం హైదరాబాద్ లిబరేషన్ డే వేడుకలు నిర్వహించనుందని తెలిపారు.
తెలంగాణలో కొత్త పథకం.. ఒక్కొక్కరికీ రూ.1 లక్ష ఆర్థిక సాయం, నవంబర్ 19 నుంచి ప్రారంభం
తెలంగాణ యువతకు రేవంత్ రెడ్డి సర్కార్ శుభవార్త చెప్పింది. యువతకు స్వయం ఉపాధి అవకాశాలను కల్పించే దిశగా రాజీవ్ యువ వికాసం పథకంపై కీలక ప్రకటన చేసింది. నవంబర్ 19వ తేదీ నుంచి అర్హులైన యువతకు రూ.1 లక్ష వరకు స్వయం ఉపాధి ఆర్థిక సాయం అందించేలా చర్యలు వేగవంతం చేయాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అధికారులను ఆదేశించారు.
2008 నుంచి 2027 వరకు.. ఐపీఎల్ వేలం హిస్టరీ.. ఏ నగరంలో ఎన్నిసార్లు జరిగిందో తెలుసా?
ఐపీఎల్ 2027 మినీ వేలం భారతదేశంలోనే జరగనుంది. అయితే 2008 నుంచి ఐపీఎల్ వేలం వేదికల ప్రయాణం ఆసక్తికరంగా మారింది. తొలి ఆక్షన్ 2008లో ముంబైలో జరగ్గా, బెంగళూరు అత్యధికంగా 7 సార్లు వేలానికి ఆతిథ్యమిచ్చింది. 2023లో కొచ్చిలో జరిగిన తర్వాత 2024 (దుబాయ్), 2025 (జెడ్డా), 2026 (అబుదాబి)లలో విదేశీ గడ్డపై ఆక్షన్స్ జరిగాయి. ఇప్పుడు మూడేళ్ల విరామం తర్వాత మళ్లీ ఐపీఎల్ ఆటగాళ్ల వేలం స్వదేశానికి చేరింది.

