ఆసియా క్రీడలు 2026లో వెయిట్‌లిఫ్టింగ్ విభాగంలో భారత్ 28 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణకు మీరాబాయి చాను స్వస్తి పలికింది. మహిళల 49 కేజీల కేటగిరీలో రజత పతకం సాధించిన ఆమె, 1998లో కరణం మల్లేశ్వరి తర్వాత ఈ ఘనత సాధించిన ఏకైక అథ్లెట్‌గా నిలిచింది. తన కెరీర్లో లోపించిన ఏకైక ఏషియన్ గేమ్స్ మెడల్ సాధించడం పట్ల ఆనందం వ్యక్తం చేస్తూ, క్రీడాకారులకు నిరంతరం అండగా నిలుస్తున్న ప్రధాని మోదీకి, దేశ ప్రజలకు చాను కృతజ్ఞతలు తెలిపింది.


