జంతర్ మంతర్ వద్ద గేట్లను దూకి లోపలికి ప్రవేశించేందుకు ప్రయత్నించారనే ఆరోపణలతో సీజేపీ నాయకులు సౌరభ్ దాస్, అశుతోష్ రాంకాలను పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రస్తుతం వారు ఇద్దరూ జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నారు. ఈ క్రమంలో వీరి అరెస్ట్‌పై ఢిల్లీ హైకోర్టులో ఓ పిటిషన్ దాఖలయ్యింది. దీనిపై విచారణ సందర్భంగా న్యాయమూర్తి కీలక వ్యాఖ్యలు చేశారు. అసలు మీరు జెన్ జీ కాదని అన్నారు. జడ్జి వ్యాఖ్యలపై సీజేపీ వ్యవస్థాపకుడు వ్యంగ్యంగా స్పందించారు.


