కేంద్ర ఎన్నికల సంఘం అంతర్గత పనితీరుపై సెప్టెంబరులో ది ఇండియన్ ఎక్స్‌ప్రెస్ ప్రచురించిన పరిశోధనాత్మక కథనం దేశ రాజకీయాలను తీవ్రంగా ప్రభావితం చేసింది. ముఖ్యంగా సీఈసీ జ్ఞానేష్ కుమార్ వివాదానికి కేంద్రంగా మారిపోయారు. ఆయనను వెంటనే తొలగించాలని కోరుతూ ప్రతిపక్షాలు నిరసన కొనసాగిస్తున్నాయి. అయితే, చదువులో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన ఆయన ఐఐటీ నుంచి ఇంజినీరింగ్ పూర్తిచేయడమే కాదు.. ప్రపంచ ప్రఖ్యాత హార్వర్డ్ నుంచి పర్యావరణ ఆర్థిక శాస్త్రంలో డిగ్రీ పుచ్చుకున్నారు.


