టీమిండియా దిగ్గజ పేసర్ జస్ప్రీత్ బుమ్రా గురించి మాజీ క్రికెటర్ పార్థివ్ పటేల్ సంచలన విషయాలు బయటపెట్టాడు. 2014 ఐపీఎల్ వేలంలో బుమ్రాని దక్కించుకోవాలని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు యాజమాన్యానికి సూచించానని తెలిపాడు. అయితే “ఈ బుమ్రా- గిమ్రా ఏం చేస్తాడులే” అని వారు లైట్ తీసుకున్నారని చెప్పాడు. అనంతరం ముంబై ఇండియన్స్ తరఫున ఆడిన బుమ్రా.. తన కెరీర్లో ఇప్పటివరకు 4 ఐపీఎల్ టైటిల్స్ దక్కించుకున్నాడు. ప్రపంచంలో నంబర్ వన్ బౌలర్గా నిలిచాడు.


