రాంచీలో వెస్టిండీస్‌తో జరుగుతున్న రెండో టీ20లో భారత బ్యాటర్లు విధ్వంసం సృష్టించారు. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 249/5 భారీ స్కోరు సాధించింది. సంజూ శాంసన్ (82) టాప్ స్కోరర్‌గా నిలవగా, లోకల్ బాయ్ ఇషాన్ కిషన్ (43), తిలక్ వర్మ (44 నాటౌట్), కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ (40) ధనాధన్ బ్యాటింగ్‌తో అలరించారు. ఈ సిరీస్ తొలి మ్యాచులో గెలిచిన భారత్.. 1-0తో ఆధిక్యంలో ఉంది.


