రాంచీ వేదికగా జరిగిన రెండో టీ20లో వెస్టిండీస్ జట్టు భారత్‌పై ఘనవిజయం సాధించింది. భారత్ నిర్దేశించిన 250 పరుగుల కొండంత లక్ష్యాన్ని కరేబియన్లు మరో 9 బంతులు మిగిలుండగానే 4 వికెట్లు కోల్పోయి ఛేదించారు. కెప్టెన్ షై హోప్ సంచలన సెంచరీతో జట్టును గెలిపించి తమ టీ20 చరిత్రలోనే అత్యంత విజయవంతమైన రన్ ఛేజ్‌ను నమోదు చేశాడు. దీంతో ప్రస్తుతం ఈ 5 మ్యాచుల టీ20 సిరీస్ 1-1తో సమమైంది.


