HomeAndhra Pradeshస్థానిక ఎన్నికల్లో బీసీలకు 34 శాతం కోటాపై.. మంత్రి నారా లోకేశ్ క్లారిటీ

స్థానిక ఎన్నికల్లో బీసీలకు 34 శాతం కోటాపై.. మంత్రి నారా లోకేశ్ క్లారిటీ

ఏపీ స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్ల అంశంపై మంత్రి నారా లోకేశ్ స్పందించారు. తమ ప్రభుత్వం బీసీ రిజర్వేషన్ల అంశంపై కట్టుబడి ఉందని క్లారిటీ ఇచ్చారు. తెలుగుదేశం పార్టీకి బీసీలే వెన్నెముక అన్నారు. అలాగే బీసీల రిజర్వేషన్ల అంశంపై వైసీపీ కుట్ర చేస్తోందని ఆరోపించారు. కాగా 34 శాతం బీసీ రిజర్వేషన్ అంశం కొత్తదేమి కాదు.. గతంలో ఆంధ్రప్రదేశ్‌ స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు అమలయ్యేవి. కాకపోతే మొత్తం రిజర్వేషన్లు 50 శాతానికి మించకూడదనే సుప్రీంకోర్టు తీర్పు వల్ల గత ప్రభుత్వం ఈ రిజర్వేషన్లను 34 నుంచి 24కు తగ్గించింది.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments