అర్థరాత్రి వేళ ఒక్కసారిగా కడుపులో మొదలైన తిమ్మిరి, ప్రశాంతంగా ఉన్న సమయాన్ని ఒక్కసారిగా అలజడికి గురిచేస్తుంది. ఏదో కాస్త అటూఇటుగా తిన్నామని సరిపెట్టుకుందామన్నా, ఆ నోప్పి కలిగించే అసౌకర్యం క్షణం కూడా ప్రశాంతంగా ఉండనివ్వదు. వెంటనే ఆసుపత్రికి పరిగెత్తే పరిస్థితి లేనప్పుడు మన ఇంటి వంటిల్లే ఒక అద్భుతమైన ఔషధాల గనిలా కనిపిస్తుంది.
అమ్మచేతి కషాయం నుంచి నానమ్మ చెప్పిన చిన్నపాటి చిట్కాల వరకు ప్రతిదీ మనల్ని ఆ నొప్పి నుంచి కాపాడేందుకు సిద్ధంగా ఉంటాయి. పూర్వీకుల కాలం నుంచి వస్తున్న ఈ సహజ వైద్యం కేవలం నొప్పిని తగ్గించడమే కాదు శరీరానికి తక్షణ ఉపశమనాన్ని అందిస్తుంది. మన వంటింట్లో సులభంగా దొరికే వస్తువులతో కడుపునొప్పిని తగ్గించే అద్భుతమైన చిట్కాలు ఏంటో, వాటిని ఎలా ఉపయోగించాలో ఈ స్టోరీలో తెలుసుకుందాం..


