ఈ రోజుల్లో చాలా మందికి గార్డెనింగ్ అంటే చాలా ఇష్టం. పూల మొక్కలతో పాటు పండ్ల చెట్లను ఇంట్లో పెంచడానికి ఆసక్తి చూపిస్తున్నారు. ఇక, దాదాపు ప్రతి ఒక్కరి ఇంట్లో కరివేపాకు మొక్క ఉంటుంది. పెరట్లో కూడా ఈ మొక్కను ఎక్కువ పెంచుకుంటారు. మన వంటల్లో కరివేపాకు వాడకం ఎక్కువ. కరివేపాకు తాళింపు లేకపోతే ఆ టేస్టే వేరు. పప్పు, ఉప్మా, పోహా లేదా ఇడ్లీ సాంబార్ ఏదైనా సరే కరివేపాకు సువాసన ఆహారపు రుచిని రెట్టింపు చేస్తుంది.
అయితే, శీతాకాలం రాగానే చాలామందికి వచ్చే ప్రధాన సమస్య కరివేపాకు మొక్క ఎండిపోవడం, ఆకులు పసుపు రంగులోకి మారి రాలిపోవడం, ఎదుగుదల ఆగిపోవడం. చలికాలంలో కరివేపాకు మొక్క చలి తీవ్రతను తట్టుకుని, రాబోయే వసంత కాలంలో ఒక చిన్న మర్రిచెట్టులా గుబురుగా, పచ్చగా మారాలంటే శీతాకాలం మొదలయ్యే ముందే ఈ 3 పనులు తప్పనిసరిగా చేయాలి. ఆ మూడు పనులేంటో ఇప్పుడు చుద్దాం.


