విదేశాలకు వెళ్లే భారతీయులు తమ నేషనల్ పెన్షన్ సిస్టమ్ (ఎన్పీఎస్) ఖాతాను మూసివేయాల్సిన అవసరం లేదు. ఎన్ఆర్ఐలు, ఓసీఐలు తమ ఎన్పీఎస్ టైర్-1 ఖాతాను నిరభ్యంతరంగా కొనసాగించవచ్చని పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ (పీఎఫ్ఆర్డీఏ) స్పష్టం చేసింది.


