Multibagger Stocks: స్టాక్ మార్కెట్లలో కొందరు పెట్టుబడులు పెడుతూ అద్భుత స్థాయిలో రిటర్న్స్ అందుకుంటుంటారు. ఇక్కడ స్టాక్ మార్కెట్లపై మంచి అవగాహన ఉన్నప్పుడే ఇదంతా సాధ్యమవుతుంటుంది. ఇలా స్వల్ప కాలంలోనే మల్టీబ్యాగర్ రిటర్న్స్ అందించిన ఒక స్టాక్ గురించి మనం ఇప్పుడు చూద్దాం. అదే పీవీపీ వెంచర్స్ లిమిటెడ్. ఇది కేవలం నెల వ్యవధిలోనే 146 శాతం పెరగ్గా ఇన్వెస్టర్లకు కాసుల పంట పండింది.


