ఓ కుటుంబంలో 200 ఏళ్లు తర్వాత ఆడపిల్ల పుట్టడంతో సంబరాలు చేసుకున్నారు. ఆ చిన్నారిని ఇంటికి మేళతాళాలతో తీసుకొచ్చారు. ఆసుపత్రి నుంచి ఇంటి వరకు రథంపై తల్లీ బిడ్డను కూర్చోబెట్టి ఊరేగించారు. కుటుంబసభ్యులు, బంధువులు సంతోషంతో ఉబ్బితబ్బుబ్బి అయ్యారు. ఎన్నో ఏళ్ల నుంచి తాము చేసిన ప్రార్థనలు ఫలించాయని, ఆ మహాలక్ష్మి తమ ఇంటికి వచ్చిందని హర్షం వ్యక్తం చేశారు. మహారాష్ట్రలోని బీడ్ జిల్లా వైద్యనాథ్కు చెందిన ఓ కుటుంబంలో నాలుగు తరాల నుంచి ఆడపిల్ల పుట్టలేదు.
Maharashtra: ఆ కుటుంబంలో 200 ఏళ్ల తర్వాత పుట్టిన ఆడపిల్ల.. రథంపై ఊరేగించి ఘనస్వాగతం
RELATED ARTICLES


