దేశ రాజధాని ఢిల్లీలో కదులుతున్న స్లీపర్ బస్సులో మైనర్ బాలికపై జరిగిన దారుణ సామూహిక అత్యాచార ఘటన నేపథ్యంలో రవాణా శాఖ బస్సుల భద్రతపై అత్యంత కఠినమైన నిబంధనలను జారీ చేసింది. ఢిల్లీలో తిరిగే స్థానిక, ఇతర రాష్ట్రాల బస్సులు అన్నింటిలో పానిక్ బటన్లు, వెహికల్ ట్రాకింగ్ పరికరాలు నిరంతరం పనిచేస్తూనే ఉండాలని స్పష్టం చేసింది. బస్సు కిటికీలకు ఉండే దట్టమైన తెరలు, పర్దాలను పూర్తిగా నిషేధించడంతో పాటు నిబంధనలు ఉల్లంఘిస్తే పర్మిట్లు రద్దు చేస్తామని తీవ్రంగా హెచ్చరించింది.
బస్సుల్లో పానిక్ బటన్లు పని చేయాల్సిందే.. పర్దాలూ ఉండొద్దు: మైనర్‌పై గ్యాంగ్ రేప్‌తో సర్కారు సంచలన నిర్ణయం
RELATED ARTICLES


