తెలంగాణ జీఎస్టీ ఆదాయంలో హైదరాబాద్ అత్యధిక వాటాను నమోదు చేస్తోంది. రాష్ట్రంలోని నమోదిత జీఎస్టీ పన్ను చెల్లింపుదారుల్లో 69 శాతం హైదరాబాద్లో ఉండగా.. ఆగస్టులో రాష్ట్ర జీఎస్టీ వసూళ్లలో నగరం 91.1 శాతం వాటా సాధించింది. హైదరాబాద్ నుంచి రూ.3,956 కోట్ల జీఎస్టీ ఆదాయం వచ్చింది. ఏప్రిల్-ఆగస్టు మధ్య రాష్ట్ర జీఎస్టీ, వ్యాట్ వసూళ్లు కలిపి రూ.36,636 కోట్లకు చేరి 16.39 శాతం పెరిగాయి. ఐటీ, ఫార్మా, రియల్ ఎస్టేట్ రంగాల కార్యకలాపాలు హైదరాబాద్ పన్ను ఆదాయానికి ప్రధాన కారణంగా నిలిచాయి.


