తెలంగాణ సెక్రటేరియట్‌లో రూ.26.81 కోట్ల అంచనా వ్యయంతో చేపడుతున్న సోలార్ కార్ పార్కింగ్ వ్యవస్థ పనులను డిసెంబరు నాటికి పూర్తి చేయాలని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. ఉత్తర భాగంలో రెండు, దక్షిణంలో మూడు, పశ్చిమంలో ఒక వరుసగా సోలార్ ప్యానెళ్లతో షెడ్లు ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. ఈ వ్యవస్థ ద్వారా సుమారు 90 వేల యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి చేసి, సెక్రటేరియట్ నెలవారీ విద్యుత్ బిల్లులో 16 శాతం వరకు ఆదా చేయవచ్చుని మంత్రి తెలిపారు. నార్కెట్‌పల్లి వంతెన పనులను కూడా వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు.


