అమెరికా పర్యటన రద్దు వ్యవహారంపై సీఎం రేవంత్రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. రాజకీయ కారణాలతోనే తన పర్యటనకు కేంద్రం అనుమతి నిరాకరించిందని ఆరోపించారు. లండన్ టూర్ పూర్తి అయిందని పేర్కొన్న సీఎం రేవంత్.. హైదరాబాద్కు చేరుకున్న తర్వాత ఈ వ్యవహారానికి సంబంధించిన అన్ని అంశాలపై సవివరంగా మాట్లాడతానని స్పష్టం చేశారు. అమెరికా పర్యటనకు అనుమతి నిరాకరణ అంశంలో తనకు మద్దతుగా నిలిచిన మల్లికార్జున ఖర్గే, పార్టీ నేతలు, ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు.


