సీఎం రేవంత్‌రెడ్డి అమెరికా పర్యటనకు కేంద్రం అనుమతి నిరాకరించడంపై వివాదం చల్లారడం లేదు. అయితే గుజరాత్ సీఎం అమెరికా పర్యటనకు అనుమతి ఇచ్చిన కేంద్రం.. రేవంత్‌రెడ్డికి మాత్రం పర్మిషన్ ఇవ్వకపోవడంతో కేంద్రం తీరుపై ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ తీవ్రంగా ఖండించింది. ఇది ద్వంద్వ వైఖరికి నిదర్శనమని ఆరోపించింది. ఇక రేవంత్ రెడ్డి పర్యటన రద్దయినప్పటికీ తెలంగాణ అధికారుల బృందం అమెరికా వెళ్లి ఒప్పందాలు, చర్చలను కొనసాగించనుంది.


