గచ్చిబౌలి ప్రమాద ఘటన నేపథ్యంలో హైడ్రా కమిషనర్ రంగనాథ్ కీలక వ్యాఖ్యలు చేశారు. అంజయ్యనగర్‌లో నిబంధనలకు విరుద్ధంగా కట్టిన భవనాలు, నాలాను అక్రమించి చేపట్టిన నిర్మాణాలను కూల్చివేస్తామని స్పష్టం చేశారు. ప్రమాద స్థలిని పరిశీలించిన రంగనాథ్.. 50 గజాలలో ఏడు అంతస్తుల భవనం, పైన పెంట్ హౌస్ కూడా నిర్మిస్తు్న్నారని తెలిపారు. అంజయ్య నగర్లో ఇలాంటి భవనాలు ఇంకా ఉన్నానని.. రూల్స్ అతిక్రమించి కట్టిన వాటిని కూల్చివేస్తామని రంగనాథ్ స్పష్టం చేశారు.


