మ్యాకే వేదికగా ఆస్ట్రేలియాతో ప్రారంభమైన రెండో టెస్టు తొలి రోజే బౌలర్ల ఆధిపత్యం నడిచింది. ఏకంగా 18 వికెట్లు పడిన ఈ మ్యాచ్‌లో, మొదట ఆసీస్ పేసర్ మిచెల్ స్టార్క్ (6/12) సంచలన బౌలింగ్‌తో బంగ్లాదేశ్‌ను 64 పరుగులకే కుప్పకూల్చాడు. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన ఆస్ట్రేలియాను బంగ్లా పేసర్ షరీఫుల్ ఇస్లామ్ (6/35) దెబ్బతీయడంతో తొలి రోజు ఆట ముగిసేసరికి ఆసీస్ 165/8తో నిలిచింది. ఆస్ట్రేలియా 101 పరుగుల కీలక ఆధిక్యంలో నిలిచింది.


