సైబరాబాద్ ఐటీ కారిడార్‌లో పెరుగుతున్న ట్రాఫిక్ రద్దీకి చెక్ పెట్టేందుకు ట్రాఫిక్ పోలీసులు పంచసూత్రాల కార్యాచరణ ప్రణాళికను రూపొందించారు. కంపెనీ ప్రాంగణంలోనే పికప్, డ్రాప్‌లను నిర్వహించడం, కార్ పూలింగ్ను ప్రోత్సహించడం, ప్రధాన ద్వారాల వద్ద ప్రత్యేక సిబ్బందితో వాహనాల నియంత్రణ, కంపెనీల సమీకృత షటిల్ రవాణా, జోన్ల వారీగా షిఫ్ట్ సమయాల మార్పు ఇందులో కీలక అంశాలు. ఐటీ సంస్థల సహకారంతో ఈ చర్యలను అమలు చేసి పీక్ అవర్స్‌లో ట్రాఫిక్ ఒత్తిడిని తగ్గించటమే లక్ష్యంగా పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు.


