మార్కెట్లో బియ్యం ధరలు పెరిగి సామాన్యుడు ఇబ్బందులు పడుతున్న వేళ.. ఏపీ ప్రభుత్వం సన్నబియ్యం విక్రయాలు ప్రారంభించింది. రాష్ట్రంలోని రైతు బజార్లు, రైస్ మిల్లుల వద్ద ఏర్పాటు చేసిన కేంద్రాల ద్వారా సన్న బియ్యం విక్రయాలు జరుపుతోంది. అయితే ఇందుకోసం తొలుత రేషన్ కార్డు ప్రామాణికంగా తీసుకోగా.. ప్రస్తుతం ఆధార్ కార్డు ఉన్నా సరిపోతుందని అధికారులు చెప్తున్నారు. మార్కెట్లో బియ్యం ధరలు భారీగా పెరిగిన నేపథ్యంలో ఎక్కువ మందికి ఉపయోగపడేలా ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్తున్నారు.
బియ్యంకార్డు లేనివారికి కూడా సన్నబియ్యం.. ప్రభుత్వం నిర్ణయం..
RELATED ARTICLES


