బీసీ రిజర్వేషన్లపై ఎవరో కోర్టుకు వెళ్తే అది తమ పార్టీకి ఏం సంబంధం అంటూ బొత్స సత్యనారాయణ ప్రశ్నించారు. బీసీలకు ప్రకటించిన 34 శాతం రిజర్వేషన్లపై వైసీపీ కోర్టును ఆశ్రయించబోదని స్పష్టం చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసీపీ అన్ని స్థానాల్లో పోటీ చేస్తుందన్నారు. ఇంత కాలం ప్రభుత్వానికి వ్యతిరేకంగా చేసిన పోరాటాలే తమ పార్టీ గెలపునకు కారణం అవుతాయని బొత్స అన్నారు. డీఎస్సీ విషయంలో నారా లోకేశ్ వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.
బీసీ రిజర్వేషన్లపై బొత్స ఇంట్రెస్టింగ్ కామెంట్స్.. స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసీపీ అన్ని స్థానాల్లో పోటీ
RELATED ARTICLES


