కేంద్ర నైపుణ్యాభివృద్ధి, వ్యవస్థాపక మంత్రిత్వ శాఖ, నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో యువతలో దాగి ఉన్న నైపుణ్యాలను వెలికి తీసేలా నైపుణ్య పోటీలు నిర్వహిస్తున్నారు. స్కిల్ ఇండియా డిజిటల్ హబ్ పేరుతో ఇప్పటికే ఈ పోటీలకు రిజిస్ట్రేషన్లు కూడా ప్రారంభమయ్యాయి. విద్యార్హత అవసరం లేకుండా కేవలం వయస్సు ఆధారంగానే ఈ పోటీలు నిర్వహిస్తున్నారు. అర్హత ఉన్న యువత ఈ నెల 30వ తేదీ లోగా దరఖాస్తులు చేసుకోవాలి. జిల్లా, జోనల్, రాష్ట్ర, ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ఈ పోటీలు నిర్వహిస్తున్నారు.
ప్రతిభ ఉంటే చాలు.. క్వాలిఫికేషన్ అవసరం లేదు! యువత కోసం కేంద్రం నైపుణ్య పోటీలు
RELATED ARTICLES


